పరిగి, డిసెంబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకంతో పేద వర్గా లు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొ న్నారు. విడుతలవారీగా ప్రతి సంవత్సరం దళితబంధు ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10లక్షలు గ్రాంటుగా అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. శుక్రవారం పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన సుకుమార్‌కు దళితబంధు కింద మంజూరైన కారును ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు.
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆర్థికాభివృద్ధికి సర్కారు పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు దళితబంధు కింద రూ.10లక్షలు గ్రాంటుగా ఇస్తుందన్నారు. లబ్ధిదారుడు నచ్చిన యూనిట్ ఎంపిక చేసుకొని ఆర్థికంగా ప్రగతి సాధించడం లక్ష్యంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఇబ్బంది కలిగితే ఆదుకోవడానికి సైతం ప్రభుత్వం రక్షణ నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. దళితబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు సమర్థవంతంగా యూనిట్లు నడిపించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.
చెక్కులు, ఎల్వోసీల అందజేత
పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, గండీడ్, చౌడాపూర్, మహ్మదాబాద్ మండలాలకు చెందిన 83 మంది లబ్ధిదారులకు రూ.54.86లక్షలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అంద జేశారు. అలాగే ఏడుగురికి చికిత్స నిమిత్తం రూ.19.50లక్షలకు సంబంధించిన ఎల్వో సీలు అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీలు కె. నాగారెడ్డి, మలిపెద్ది మేఘమాల, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, బీఆర్ఎస్ మండల నాయకుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.