అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 11 : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చిన్నరావిరాల గ్రామ పంచాయతీ గువ్వలేటి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి బీఆర్ఎస్ను మరోసారి గెలింపించాలని అభ్యర్థించారు. మూసి పరివాహక గ్రామాల్లో గతంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి వ్యవస్థ లేక ఇబ్బందులు ఉండేవన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని మౌలి వసతులు కల్పించానని గుర్తు చేశారు.
గ్రామంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. బండరావిరాల మైనింగ్ సమస్యను సీఎంకు వివరించానని తెలిపారు. చెప్పిన మూడు రోజుల్లోనే జీఓ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు యాదవులు గొర్రెపిల్లను, గౌడన్నలు ముస్తాదును బహూకరించారు. అనంతరం మహిళలు అభ్యర్థితో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సర్పంచ్ సురకంటి వనజ, ఎంపీటీసీ దంతూరి అనిత, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కోట వెంకట్‌రెడ్డి, యువజవిభాగం అధ్యక్షుడు వినయ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కోట లక్ష్మారెడ్డి, సంయుక్త కార్యదర్శి మొలుగు దానేశ్, మాజీ అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, సర్పంచ్‌లు చెరుకు కిరణ్‌గౌడ్, కావలి రంగయ్య, తుడం మల్లేశ్ పాల్గొన్నారు.
ఆదిబట్ల : అభివృద్ధి చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు మౌనిక అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఆదిబట్ల మున్సిపల్ వైస్ చైర్‌ప్సన్ కోరే కళమ్మ ఆధ్వర్యంలో ఎంపీ పటేల్‌గూడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కొంగరకలాన్‌లో 7వ వార్డులో కాకి రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నారని మౌనిక, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు వనం శ్రీను, మహేందర్, నాయకులు జంగయ్య, పొట్టి శ్రీకాంత్, రాజేశ్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపు కోసం కుటుంబ సభ్యులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. మున్సిపాలిటీ పరిధి 21వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, యువజన విభాగం అధ్యక్షుడు కొత్తకుర్మ కార్తీక్, వార్డు కమిటీ అధ్యక్షుడు యాదిరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మేతరి శంకర్, చెవుల నరేందర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచిరెడ్డితోనే మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కుమార్తె శీతల్ అన్నా రు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆమె మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, పలువురు కౌన్సిలర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మమత, ప్రసన్నలక్ష్మి, పద్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డబ్బికార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని వైస్ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో ఆయన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు అనంతుల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని బ్రీజీవ్యాలీలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలు కారు వెంట నడుస్తామని చెప్తున్నాయని, మరోసారి కిషన్‌రెడ్డి విజయం ఖాయమైందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పరశురాంనాయక్, బీఆర్ఎస్ నాయకులు దేవిడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, రావుల గోపాల్‌గౌడ్, లక్ష్మణాచారి, భూషణం తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మేడిపల్లి, గున్గల్, యాచారం, నల్లవెల్లి, ధర్మన్నగూడ, తులేఖుర్ధు తదితర గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడ కృష్ణ, మక్కపల్లి శ్రీనివాస్, కిషన్, దోస మహేశ్, మధు, జిల్లా రాములు, యాదయ్యగౌడ్, లక్ష్మీపతిగౌడ్, రవి, అచ్చన రమేశ్, భీం యాదవ్ తదితరులున్నారు.
మంచాల : కారు గుర్తుకు ఓటు వేయాలని వివిధ గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగింది. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పున్నం రాము, కందాల శ్రీశైలం, చిందం రఘుపతి, చిందం జంగయ్య, మాడ్గుల కృష్ణ, జానీపాషా, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.