దోమ, మార్చి 3 : వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో అయినాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలోని నాలు గు వార్డుల్లో గత వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నామని.. వాడుకునేందుకు నీళ్లు రావడం లేదని ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి, వాటర్మన్లకు పలుసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపామన్నారు.
ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నరేందర్‌గౌడ్ అక్కడికి చేరుకొని మహిళలకు సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ విషయమై పం చాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. బోరుబావిలో నీరు తగ్గిందని.. మిషన్ భగీరథ తాగునీరు కూడా సరిపడా రావడం లేదన్నారు. బోరు బావిలో మరో నాలుగు పైపులను దింపి సమస్యను పరిష్కరిస్తామన్నారు.