Vikarabad | బొంరాస్పేట, ఏప్రిల్ 20 : ఈనెల 17వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో అస్తవ్యస్తంగా హస్నాబాద్ అనే శీర్షికతో ప్రచురించబడ్డ వార్తకు అధికారులు స్పందించారు. ఆదివారం మురుగు తొలగింపు చర్యలు చేపట్టారు. చాలా కాలంగా మురుగు కాలువలో చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్డుపై పారుతుండడంతో స్థానిక ప్రజలతో పాటు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మురుగు తొలగింపుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.