వికారాబాద్, ఆగస్టు 8 : చెత్త కుప్పలో కంటి వెలుగు అద్దాలు శీర్షికన శుక్రవారం పేపర్లలో ప్రచురితమైన వార్తకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి స్పందించారు. కళ్లద్దాలు పారవేసిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ సిబ్బందిని పంపించి వాటిని సేకరించి, కొత్తగడి పట్టణ ఆరోగ్య కేంద్రంలో అందజేసినట్లు తెలిపారు.
విధులు, నిర్వహించాల్సిన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కొత్తగడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కృప, సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.