చేవెళ్లటౌన్, మే 6 : తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్షాలు కురవక భూగర్భ జలాలు ఎండిపోయి నీళ్ల కోసం పడరాని పాట్లు పడేవారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు చేవెళ్ల మండల ప్రజలు గొంతు తడుపుకోవడమే కష్టంగా మారేది. అయినా గత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. నగరానికి అతిచోరువలో ఉన్న చేవెళ్ల పట్టణం అభివృద్ధి చెందుతుంది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని అందిస్తూ మహిళలను ఇంటి నుంచి నీళ్ల కోసం బయటకు రాకుండానే నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీటిని అందిస్తూ మంచి నీటి సమస్యను తీర్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా చేవెళ్ల మండలంలోని గ్రామాలకు పైపులైన్ వేసి ప్రజలకు సచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా చేవెళ్లకు శాశ్వతంగా మంచినీటి గోసను తీర్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేవెళ్ల మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతారం సమీపంలో నీటి శుద్ధి..
షాబాద్ మండల పరిధిలోని అంతారం గ్రామ సమీలంలో ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేసి చేవెళ్ల మండలంతో పాటు మిగతా మండలాలకు కూడా సరఫరా చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో పైపు లైన్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగు నీటిని సరఫరా చేస్తున్నారు.
సీఎం సారు కృషితోనే తాగునీరు..
ఎండాకాలం వచ్చిందంటే నీటికోసం ఉరుకుల పరుగులు నిత్యం ఉండేవి. సీఎం సార్ పుణ్యంతోనే నేడు గ్రామాలకు ప్రతి రోజూ ఉదయాన్నే నీటి సరఫరా అవుతుంది. ఇకపై బావులు, బోర్ల వద్దకు పరుగులు లేకుండా ఉదయాన్నే నల్లాల ద్వారా నీటిని పట్టుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమే ఇదంతా.
– లక్ష్మి, చేవెళ్ల
తాగునీటి ఇబ్బందులు తప్పాయి..
చేవెళ్ల ప్రాంతం ప్రజలు పూర్తిగా బోరునీటిపైన ఆధారపడేవారు. ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయి మంచి నీటి కరువు వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని అందిస్తున్నది. లేకపోతే ఎండాకాలం వచ్చిందంటే నీల్లా కోసం ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ఎండాకాలం వచ్చినా నీటి సమస్య లేదు.
– ఇమ్రాన్, చేవెళ్ల
ఎండాకలం నీటి సమస్య తీరింది..
ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ నల్లా ఇచ్చి నీళ్లు అందిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి ఎండాకాలంలో కూడా నీటి గోస తొలిగి పోయింది.
– చంద్రకళ, చేవెళ్ల