వికారాబాద్, అక్టోబర్ 24 : బలవంతంగా భూములను సేకరించొద్దని రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల రైతులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారికి సీపీ ఎం జిల్లా కార్యదర్శి మహిపాల్తోపాటు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్తోపాటు రైతులు మాట్లాడుతూ.. దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామ పరిధిలోని రోటిబండతండా, పులిచెర్లకుంటతండాలకు చెందిన 30 మంది రైతులను అధికారు లు కలెక్టరేట్‌కు పిలిపించి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం మీ భూములను కంపెనీల ఏర్పాటుకు ఇవ్వాలని నిర్ణయించిందని.. పరిహారంగా ఎకరాకు రూ.20 నుంచి రూ. 23 లక్షల చొప్పున పరిహారంగా ఇస్తామని చెబుతున్నారన్నారు. ప్రభు త్వం అభివృద్ధి పేరుతో పచ్చని పంటలు పండే భూములను బలవంతంగా తమ నుంచి తీసుకోవడం తగదన్నారు. కంపె నీల ఏర్పాటుకు కొండలు, గుట్టలు, వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను తీసుకోవాలని సూచించారు.
తమ ను బెదిరించి భూములు తీసుకోవద్దన్నా రు. నిరసనలో లగచర్ల రోటిబండతండా, ఆయా తండాల గిరిజన రైతు లు, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, నాయకులు అక్బర్, ప్రశాంత్, నవీన్, రామూనాయక్, చందర్, లక్ష్మ ణ్, శంకర్, మాణిక్‌నాయక్, శ్రీనివాస్, హనుమంతు, గోపాల్, సక్రీబాయ్, లక్ష్మీబాయి, సోనీబాయ్, చంద్రిబాయ్, రాఘవేందర్, పాండూనాయక్, తూకా రాం తదితరులు పాల్గొన్నారు