TB | దౌల్తాబాద్, జూలై 08 : క్షయ విషయంలో అప్రమత్తత అవసరం ఉందని దౌల్తాబాద్ పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ అమూల్య ప్రియదర్శిని అన్నారు. మండలంలోని బాలంపేట్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రంలో పీహెచ్సీ వైద్యాధికారి అమూల్య ఆధ్వర్యంలో టీవీ ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ క్యాంప్‌లో 150 మందిని పరీక్షించగా 18 మంది క్షయ వ్యాధి లక్షణాలు తేలాయి. వారిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపి ఎక్స్‌రే పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ శిబిరంలో సూపర్వైజర్ రఫీ, ఎంఎల్‌హెచ్‌పీ మంజుల, ఎస్టీఎస్ రాహత్, ఎల్టీ శ్రీధర్, ఏఎన్ఎంలు తిరుపతమ్మ, అనితతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.