వికారాబాద్, అక్టోబర్ 21 : ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి 114 దరఖాస్తులు రాగా.. అందులో భూసమస్యలు, రైతు రుణమాఫీ తదితర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఉన్నాయన్నారు. స్వీకరించిన వాటిలో కొన్నింటి ని అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని శాఖల వారీ గా అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, ఆర్డీవో వాసుచంద్ర, జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 84 ఫిర్యాదులు..
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుం డా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిషరించాలని అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సం బంధించి 17 దరఖాస్తులు, జిల్లా విద్యాశాఖకు సంబంధించి 6, రెవెన్యూ శాఖకు సంబంధించి 52, పంచాయ తీ శాఖకు సంబంధించి 4, మున్సిపల్ శాఖకు సంబంధించి 4, జీహెచ్ఎంసికి సంబంధించి ఒక్క దరఖాస్తు కలిపి మొత్తం 84 దరఖాస్తులొచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.