చేవెళ్లటౌన్, ఆగస్టు 11: గొర్రెల పంపిణీతో గొర్ల కాపరుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగు నింపిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని రేగడి ఘణపూర్‌లో రెండో విడుత లబ్ధిదారులకు 6 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ ద్వారా గొర్ల కాపరుల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు. అనంతరం కురుమ సంఘం కమ్యూనిటీ హాల్‌కి భూమి పూజ చేసి రూ.10లక్షలు మంజూరు చేసి, గొర్రెలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, మహేశ్, సర్పంచ్‌లు మల్లారెడ్డి, నరహరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు సదానందం, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, సత్తి, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, ఎల్లయ్య, ఘని, జైపాల్‌రెడ్డి ఉన్నారు.
మొయినాబాద్, ఆగస్టు 11 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ఏర్పాటు చేసిన చేవెళ్ల ఆరోగ్య రథాన్ని మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలో ఆయన ఎంపీపీ గునుగుర్తి నక్షత్రంజయవంత్, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌లతో కలిసి ప్రారంభించారు. వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంతో పాటు పార్లమెంటు పరిధిలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఆలోచనతో ఎంపీ రంజిత్‌రెడ్డి సొంత నిధులతో ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొయినాబాద్ నుంచి చందానగర్ గేట్ వరకు బీటీ రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రజిత, ఎంపీటీసీ లత, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి.మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎల్కగూడ సర్పంచ్ కుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పి.జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ గీతావనజాక్షి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, బీఆర్ఎస్ యువత మండల అధ్యక్షుడు పరమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.