రంగారెడ్డి, నవంబర్ 10 : ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరుచేస్తూ విడుదల చేసిన జీవోనం.34ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సర్కారు జీవో నం.34 ద్వారా అందుబాటులో ఉన్న ఉద్యమకారులను సర్దుబాటు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని కోరారు. జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా అమలు కావడంలేదని, దివ్యాంగుల సంక్షేమం, నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌ను జిల్లాస్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.