కేశంపేట, ఆగస్టు 11 : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో నుంచి డీజిల్‌ను(Diesel theft) గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సిబ్బంది సోమవారం గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫలక్‌నూమ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ29జెడ్3446) కొండారెడ్డిపల్లి గ్రామంలో రాత్రి బస చేస్తుంది.
తిరిగి ఉదయం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆగి ఉన్న బస్సులో నుంచి డీజిల్ క్లిప్‌ను విరగ్గొట్టి లాక్ తీసి 90లీటర్ల డీజిల్‌ను అపహరించినట్లు తెలిపారు. ఈ విషయమై డ్రైవర్ నయీం, కండక్టర్ లక్ష్మణ్ కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నేత ప్రేమ్‌కుమార్‌గౌడ్ ఆర్టీసీ సిబ్బందికి డీజిల్ ఖర్చులకోసం కొంత నగదును అందజేశారు.