Mehdipatnam | మెహదీపట్నం ఫిబ్రవరి 16 : మెహదీపట్నం డిపో పరిసర ప్రాంత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు, ఈ నెల 17 (సోమవారం)న డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.
సోమవారం ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకు మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని డిపో మేనేజర్ బీవీకే మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. అందుకోసం ప్రయాణికులు ఈ ఫోన్ నం. 9959226133 సంప్రదించాలని సూచించారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు