చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 17 : వరంగల్‌లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు భారీగా తరలిరావాలని డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చేవెళ్ల, శంకర్‌పల్లిలలో ఆయన రజతోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను బీఆర్ఎస్ రెండు మండలాలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధే తప్పా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేద ని విమర్శించారు. రజతోత్సవ సభకు ప్రజలు గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి జాతరలా తరలివెళ్లి సక్సెస్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల, శంకర్పల్లి మండలాల అధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్, గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బాల్‌రాజ్, ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమల్ల ఆంజనేయులు, పార్టీ చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, నాయకులు శేఖర్‌రెడ్డి, కొల్లగల్ల భాస్కర్, శేరి రాజు, మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్ ఘని, ఎల్లన్న, వెంకటేశ్, నర్సింహులు, పాండు, రెండు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.