ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోసా తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పు లు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడంలేదు. ఈ పరిస్థితిలో రైతన్న బాధలు వర్ణణాతీతంగా మారాయి. సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొరగా అందుతున్న యూరియా పంటలకు సరిపోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
షాబాద్,సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉదయం 6 గంటల నుంచే యూరియా టోకన్లు చేతుల్లో పట్టుకుని రైతులు క్యూలో నిలబడ్డా రు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు గంటల తరబడిగా అక్కడ పడిగాపులు కాయాల్సి వచ్చింది. మొదట టోకన్లు ఉంటే సరిపోతుందని చెప్పిన అధికారులు తర్వాత పట్టాదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డు కావాలని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. మీరు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నదాతలు మండిపడ్డారు. ఒక్క లారీ మాత్రమే రావడంతో అది ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
పోలీసు పహారాలో పంపిణీ
కేశంపేట : మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపు ఎదుట రైతులు యూరియాకోసం బారు లుతీరారు. మన గ్రోమోర్ కేంద్రానికి 440 బస్తాల యూరియా రాగా.. 800 మందికి పైగా రైతులు అక్కడ క్యూలో నిల్చున్నారు. దీంతో సిబ్బంది పోలీస్ పహారాలో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఎరువు అందని రైతులు నిరాశ చెందారు.
ఉదయం నుంచే నిరీక్షణ
మంచాల : మండలంలోని సహకార సంఘం కార్యాలయానికి బుధవారం ఉదయం 5 గంటలకు 450 బస్తాల యూరియా వచ్చిందని తెలు సుకున్న రైతులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని.. ఒకరినొకరు తోసుకోవడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం స్పందిం చి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు.
యూరియా కొరత తీరలే..
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ వద్ద ఆయా గ్రామాల రైతులు యూరియా కోసం బా రులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్నా సరిపడా యూరియా అందక అవస్థలు పడ్డారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని వస్తే.. రోగుల గడిచినా అందని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు.
టోకెన్ల కోసం పడిగాపులు
యాచారం : మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియాకోసం రైతులు పడిగాపులు కాశారు. టోకెన్ల కోసం కార్యాలయం ఎదుట కూర్చున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, అదును దాటిపోతే ఫలితం ఉండదని
ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లు ఇచ్చిన ప్రతి రైతుకు యూరియాను సరిపడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తప్పవన్నారు.