దళితబంధు దేశానికే ఆదర్శం
దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గుండుమల్ల ప్రవీణ్‌కుమార్ లబ్ధిదారుడికి దళితబంధు ద్వారా కార్డు కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి
కులకచర్ల, జూన్ 14 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గుండుమల్ల ప్రవీణ్‌కుమార్ లబ్ధిదారుడికి దళితబంధు ద్వారా కారు కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, నాయకులు వెంకటయ్యగౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.
దళిత బంధుతో ఉపాధి పొందాలి
దళిత బంధుతో దళితులు పూర్తి స్థాయిలో ఉపాధిపొందాలని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆయన నివాసంలో దళితబంధు ద్వారా మంజూరైన కారును లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది దళితులు ఉపాధి పొందడంతో పాటు వారి జీవితాలు బాగుపడుతాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగరాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, నాయకులు మొగులయ్య, కొండయ్య, నర్సింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

