రంగారెడ్డి, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో దళితబంధు అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో పలువురికి యూనిట్లను అందజేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదివరకే దళితబంధు కింద జిల్లాకు రూ.17 కోట్లు అందజేసిన రాష్ట్ర సర్కార్.. తాజాగా మరో రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. మిగతా రూ.37.80 కోట్లు కూడా మరో పదిహేను రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే విడుదలైన నిధులకు అనుగుణంగా అధికారులు యూనిట్ల గ్రౌండింగ్ చేపట్టారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున డబ్బులను జమ చేశారు. ప్రస్తుతానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 20 మంది చొప్పున మొత్తం 160 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేయనున్నారు. కాగా జిల్లాలో దళితబంధు కోసం మొత్తం 698 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
రంగారెడ్డి జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పలువురు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీతోపాటు మంజూరు పత్రాల ను కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులకు ఒకేసారి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. కాగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే 698 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా వారు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి సమస్యలుంటే నిపుణులతో వారికి పూర్తి స్థాయి లో అవగాహన కల్పించడం కూడా పూర్తయిం ది. జిల్లాకు దళితబంధు కింద ప్రభుత్వం రూ. 32 కోట్ల నిధులను విడుదల చేసింది.
మిగిలిన నిధులను త్వరలోనే ప్రభుత్వం పంపిణీ చేయ నున్నది. ఇప్పటికే విడుదలైన నిధుల వరకు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీతోపాటు మంజూ రు పత్రాలను కూడా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేయనున్నారు. జిల్లాలోని షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున 160 మంది లబ్ధిదారులకు ఈనెల 14వ తేదీన యూనిట్లను అందించేందుకు జిల్లా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
అంతేకాకుండా మిగిలిన రూ.37.80 కోట్ల నిధులు కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నది. జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరం నుంచి 100, చేవెళ్ల నుంచి 82 మంది, ఇబ్రహీంపట్నం నుంచి 100 మంది, ఎల్బీనగ ర్ నుంచి 81మంది, కల్వకుర్తి నుంచి 63 మం ది, రాజేంద్రనగర్ నుంచి 100 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి 72 మంది చొప్పున ఎమ్మెల్యేలు లబ్ధిదారులుగా 698 మందిని ఎంపిక చేశారు.
లబ్ధిదారుల బ్యాంకుఖాతాల్లో ..
దళితబంధు కార్యక్రమం కింద ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే జిల్లా అధికారులు డబ్బులను జమ చేశారు. నియోజకవర్గానికి 20 మంది చొప్పున లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో కలెక్టర్ ఖాతా నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షల చొప్పున జ మ అయ్యాయి. అయితే జిల్లాలోని లబ్ధిదారులు అధికంగా ట్రాక్టర్లు, మినీ డెయిరీలకు సంబంధించిన యూనిట్లను ఎంచుకున్నారు. అయితే యూనిట్ల ఎంపికలో అధికారులు లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్‌కు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి నిపుణులతో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించా రు. అయితే ఈ నెల 14న లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్న యూనిట్లలో అత్యధికంగా (మె జారిటీ వాటా) మినీ డెయిరీలకు సంబంధించినవి 70వరకు ఉన్నాయి. అందుకు సంబంధించి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లబ్ధిదారులకు ప్రభు త్వం మంజూరు చేసే రూ.10 లక్షల నుంచి రూ. 10వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో వ్యాపారంలో ఏమైనా నష్టం వస్తే ఆ నిధి నుంచి లబ్ధిదారులను ఆదుకోవడం జరుగుతుంది.
నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున పంపిణీ
రంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 14 వతేదీన యూనిట్ల పం పిణీకి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.32 కోట్లు విడుదలయ్యా యి. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ చేశాం. లబ్ధిదారులు అధికంగా ట్రాక్టర్లు, మినీ డెయిరీలను ఎంచుకున్నారు.
– ప్రవీణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ