రంగారెడ్డి, ఫిబ్రవరి 26, (నమస్తే తెలంగాణ): జిల్లాలో దళితబంధు పథకం ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే రూ.17 కోట్ల నిధులు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ కాగా.. మిగిలిన రూ. 51.90 కోట్లు కూడా త్వరలోనే రానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 689 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనున్నది. కాగా జిల్లాకు రావాల్సిన రూ. 68.90 కోట్ల నిధులను ప్రభుత్వం కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ చేసిన తర్వాతే 689 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జిల్లా అధికారులు జమ చేయనున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు గ్రౌండింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే లబ్ధిదారులు ప్రాథమికంగా ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే నిపుణులతో వారికి అవగాహన కల్పించింది. నియోజకవర్గాలవారీగా ఎంపికైన లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి లబ్ధిదారులు ఎంచుకున్న ఐదు యూనిట్లలో ఏ వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుందో వారికి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. కాగా సోమవారం సాయంత్రం లోగా లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాల వివరాలను తెలపాలని అధికారులు సూచించడంతో యూనిట్ల తుది ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కానుంది.
దళితుల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో రానున్న రోజుల్లో దళితులు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు మరిం త మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగనున్నారు. అయితే ఈ పథకంలో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, పరిశీలన, బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ పూర్తికాగా యూనిట్ల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మొదటి విడుతలో ఎంపికైన లబ్ధిదారులకు ప్ర భుత్వం రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయన్నది. త్వరలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న దృష్ట్యా ఆలోపే యూనిట్ల ఎంపికతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రి య పూర్తికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. కాగా లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్ల ను ఎంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 698 మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు ఎంపిక చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరంలో 100మంది, చేవెళ్లలో 82 మంది, ఇబ్రహీంపట్నంలో 100 మంది, ఎల్బీనగర్లో 81 మంది, కల్వకుర్తిలో 63 మంది, రాజేంద్రనగర్‌లో 100 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గం లో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాం గం నిపుణులతో వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించింది. మరోవైపు లబ్ధిదారులకు ప్రభుత్వం మం జూరు చేసే రూ.10లక్షల నుంచి రూ.10 వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారం, ఇత ర వ్యవహారాల్లో ఏవైనా ఇబ్బందులొస్తే రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకోనున్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ప్రక్రియ ఊపందుకున్నది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా.. తాజాగా ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. తొలివిడుతలో జిల్లావ్యాప్తంగా మొత్తం 689 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.68.90కోట్లు అందనున్నాయి. అయితే ఇప్పటికే రూ.17కోట్లను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. మిగతా రూ.51.90కోట్లను కూడా ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో నిధులు అందిన తరువాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులు ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న యూనిట్లపై జిల్లా యంత్రాంగం అవగాహన కల్పించింది. సోమవారం సాయంత్రంలోగా తమకు నచ్చిన యూనిట్‌ను తుది ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. లబ్ధిదారులకు డబ్బులు అందిన వెంటనే యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల యూనిట్ల ప్రక్రియ సోమవారంలోగా పూర్తి కానుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాలపై నిపుణులతో అవగాహన కల్పించడంతోపాటు సోమవారం సాయంత్రంలోగా ఎంచుకున్న యూనిట్ల వివరాలను తెలపాలని వారికి సూచించడం జరిగింది. ఇప్పటికే జిల్లాకు రూ. 17 కోట్లు విడుదల కాగా, మిగతా నిధులు త్వరలోనే రానున్నాయి. పూర్తి నిధులు విడుదలైన వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం.
– ప్రవీణ్ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ