పూడూరు, జనవరి 31 : మా భూములను కబ్జా చేస్తున్నారని.. వాటిని ఇప్పించాలని ఎన్కెపల్లి గ్రామస్తులు శుక్రవారం వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రాన్ని సమర్పించి..తమ గోడును చెప్పుకొన్నారు.
ఎన్కెపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు మన్నెగూడ పెంటయ్య, కంతల భీమ య్య, బుజ్జమ్మ, ఆనందం, మాలె భీమయ్య, విజేందర్, పులిందర్ తదితరులకు చెందిన సర్వేనంబర్ 115లో 19 ఎకరాల ఇనాం పట్టా భూమి ని రియల్టర్ ఆలంఖాన్, మల్లి యువరాజు, ఐదర్, సుధాకర్‌రెడ్డి కబ్జా చేసి మైరాన్ వెంచర్ పేరుతో లేఅవుట్ చేస్తున్నారని.. ఇది ఏమిటని అడిగితే రౌడీలతో చంపిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పం దించిన అదనపు కలెక్టర్.. ఆర్డీవో ద్వారా విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.