షాద్‌నగర్ : బైక్ అదుపు తప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన దాసరి నర్సింహ (40) అనే వ్యక్తి తన బైక్‌పై షాద్‌నగర్ నుంచి కిషన్‌నగర్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న బండరాయిపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో నర్సింహ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని షాద్‌నగర్ సర్కారు దవాఖానకు తరలించారు.