మంచాల : హైదరాబాద్‌లో జరుగుతున్న అందాల పోటీదారులను అడ్డుకుంటారనే ముందస్తుగా పోలీసులు సీపీఎం నాయకులను (CPM Leaders ) ముందస్తుగా అరెస్టు ( Arrest ) చేశారు. సోమవారం మధ్యాహ్నం నాగార్జున సాగర్‌లోని బుద్ధవనానికి వెళ్లుతున్న అందాల పోటీదారులకు ( Beauty Pageants ) ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు మంచాలలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్యను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈసందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకపక్క చెప్పుకుంటూ మరో పక్క అందాల పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం సిగ్గుచేటని ఆరోపించారు. రైతులు కరువు కటకాలతో పాటు అకాల వర్షాల వలన చేతికి వచ్చే పంటలు పూర్తిగా నేలపాలై రైతులు లబోదిబోమంటుంటే వారి కష్టాలను పట్టించుకోకుండా అందగత్తెలతో పోటీలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలని , ఇలాంటి పోటీలు నిర్వహించడానికి డబ్బులు ఖర్చు పెట్టడం దారుణమని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఎం నాయకులు కొర్రెంకల నర్సింహ్మ, కందుకూరి జగన్, శ్యాం సుందర్, ఆవుల యాదయ్య, చందునాయక్, జంగయ్య ఉన్నారు.