చేవెళ్లటౌన్, ఏప్రిల్ 29 : అదానీ, అంబానీ చేతిలో నరేంద్ర మోదీ కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య అరోపించారు. సీపీఐ ఇంటింటికీ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దె బ్బ తిన్నదని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని విమర్శించారు. మో దీని గద్దె దించే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ రామస్వామి, కో-కన్వీనర్ ప్రభులింగం, మండల కార్యదర్శి సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ చారి, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి మగ్బూల్ తదితరులు పాల్గొన్నారు.