మియాపూర్ ఏప్రిల్ 1: వేసవికాలంలో బాటసారిగా దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ సుమిత్ర నగర్ జాతీయ రహదారిపై చైతన్య నగర్ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుతో కలిసి మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా రోజా దేవి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ తమ సేవలను అందిస్తూ ప్రజలకు తాగునీటిని అందిస్తుండడం అందరికీ స్ఫూర్తిదాయకమ న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, కమిటీ సభ్యులు బాలరాజు నరసింహ చారి, కె ఎన్ రెడ్డి, కృష్ణంరాజు, యాదగిరి, అనిల్ కుమార్, మల్లేష్, నవీన్, చారి, బాలకృష్ణ, లక్ష్మణ్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.