మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి కాం ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి.. జిల్లాలోని మిగిలిన సెగ్మెంట్తైన పరిగి, వికారాబాద్, తాండూరు పరిధుల్లోని కాంట్రాక్టర్లకు బిల్లులు మం జూరు చేయకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కొడంగల్‌కు ఇచ్చి.. మాకేందుకు ఇవ్వరని.. తమపై శీతకన్ను తగదని వారు పేర్కొంటున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద పూర్తైన పనులకు సం బం ధించి చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తైనా కాంట్రాక్టర్లకు సంబంధిత డబ్బులను విడుదల చేయకపోవడం గమనార్హం. గతేడాదిగా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రాలు అం దిస్తున్నా ఇప్పటికీ నిధులకు మోక్షం లభించలేదు.
అయితే, రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్‌పైనే దృష్టి సారించి రూ. వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ .. వికారాబాద్, పరిగి, తాం డూరు సెగ్మెంట్లపై శీతకన్ను చూపుతున్నది. రెండు నెలల కిందట కొడంగల్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పూర్తైన పనులకు బిల్లులను విడుదల చేసిన ప్రభుత్వం వారికే అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కాంట్రాక్ట్‌నూ అప్పగించింది. మరోవైపు వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెంట్లలో ‘మన ఊరు-మన బడి’ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు.. భార్యల పుస్తెల తాడులు విక్రయించి.. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి బడుల్లో మౌలిక వసతులను కల్పించామని.. తమ పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
జిల్లాలో 20 స్కూళ్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పించారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటిం గ్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్న త పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు.
కాగా జిల్లాలో 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో మొదటి విడతలో 371 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ఎంపిక చేశారు. మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 పాఠశాలలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ’మన ఊరు-మన బడి’ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే ఇందులో గతంలో ‘మన ఊరు-మన బడి’లో పనులు పూర్తి కాని పాఠశాలలను ఎంపిక చేసి పనులను చేపట్టారు.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా బడు ల్లో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తికాగా.. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు గతేడాదిగా ఎదురుచూస్తున్నారు. స్కూల్ కమిటీలు, సంబంధిత అధికారుల ఒత్తిడితో పలు స్కూళ్లలో పనులను పూర్తి చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు.. కలెక్టర్, ప్రజాభవన్, సచివాలయంలోని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకెళ్లినా ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రతివారం కాం ట్రాక్టర్లు ప్రజావాణిలో బిల్లులను విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా.. త్వరలోనే వస్తాయంటూ అధికారులు దాట వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడుల్లో సొంత నిధులు, అప్పులు తీసుకొచ్చి మౌలిక వసతులను కల్పించామని.. ఏడాది దాటినా బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, బతకడం కష్టంగా మారిందని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మొదటి విడతలో 371 బడులను ఎంపిక చేయగా, 20 స్కూళ్లలో పనులు పూర్తి కాగా గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. కాగా సుమారు 300 స్కూళ్లలో పనులు 20-50 శాతం మేర పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది.
పూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ. 25 లక్షలు అప్పులు తీసుకొచ్చి పనులు పూర్తి చేశా. గత 14 నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా. తెచ్చిన అప్పుల కు ప్రతినెలా వడ్డే రూ.50,000 అవుతున్నది. అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు నెల రోజుల్లో బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం మాకు చెల్లించకపోవడం దారుణం.
– జంగయ్య, స్కూల్ కమిటీ మాజీ చైర్మన్, పూడూరు
ముజాహిద్పూర్ ఉన్నత పాఠశాలలో ముగ్గురం కలిసి రూ.40 లక్షలతో మౌలిక వసతులను కల్పించాం. వాటి బిల్లుల కోసం ఏడాదికిపైగా డీఈవో కార్యాలయం మొదలుకొని కలెక్టరేట్, సచివాలయం వరకు ప్రదక్షిణలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిల్లులను విడుదల చేయడం లేదు. ఎంబీలు పూర్తైనా బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కేవలం కొడంగల్ నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు విడుదల చేసి తమపై వివక్ష చూపడం తగదు. మేం అప్పులు చేసి మరీ పనులు చేపట్టాం. ఇప్పుడు వడ్డీలు చెల్లించలేకపోతున్నాం.
-అరవింద్, కాంట్రాక్టర్, ముజాహిద్పూర్, కులకచర్ల మండలం