హైదరాబాద్ : క్రేన్ కూలి మృతి చెందిన కుటుంబాలకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పరిహారం ప్రకటించింది. నిన్న భవన నిర్మాణ స్థలంలో రెండు క్రేన్లు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంగళవారం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. కాగా, రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు( Labours ) మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మహాలింగాపురంలో ఎన్సీసీ సిమెంట్( NCC Cement ) బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ (Crane Collapses) ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలింది.
ఆ సమయంలో 10 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా వారిపై క్రేన్ పడడంతో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు.