shad nagar | షాద్‌నగర్ టౌన్, మే 16: షాద్‌నగర్ పట్టణ శివారులోని డంపింగ్‌యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగా వీధికుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
వీధికుక్కల నియంత్రణ కేంద్రం ఏర్పాటు కోసం మున్సిపల్ నిధులు రూ.25 లక్షలు కేటాయించినట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఇందులో ప్రతిరోజు వీధికుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తారని పేర్కొన్నారు. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.