తుర్కయంజాల్ : పేదల విద్యపై రాష్ట్ర ప్రభుతానికి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, ప్రకాష్ కారత్ అన్నారు. సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలోని ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పేదల విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని పాఠశాలలో విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జూలై 4, 5 తేదీల్లో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఆశీర్వాదం, యాదగిరి, జంగయ్య, మధు, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.