దోమ, మే 12 : పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను నాటి ఆహ్లాదాన్ని పంచగా.. నేటి కాంగ్రెస్ పాలనలో వాటి నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కనుమరుగవుతున్నాయి. ఇందుకు నిదర్శనం మండలంలోని పలుగుతండా పంచాయతే.. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంలో నాటిని మొక్కలకు నీటిని అందించకపోవడంతో అవి ఎండి పోతున్నాయి.
దానికి తోడుగా గుర్తు తెలియని వ్యక్తులు గడిసింగాపూర్ రంగారెడ్డిపల్లిని కలిపే ప్రధా న రోడ్డు పక్కన అడవిని ఆనుకుని ఉన్న పొదలకు నిప్పంటించడంతో ఎండిపోయి ఉన్న పల్లెప్రకృ తి వనంలోని మొక్కలు చాలావరకు నిప్పంటుకుని కాలిపోయాయి. ఇంత జరిగినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని పలుగుతండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని పల్లెప్రకృతివనాలకు పూర్వవైభవం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.