బతుకమ్మ, దసరా రాష్ట్రంలోనే పెద్ద పండుగలు. ప్రజలంతా ఒక్కచోట చేరి చేసుకునే వేడుకలు. కేసీఆర్ హయాంలో ప్రతి పల్లె, పట్టణంలో పది రోజుల ముందునుంచే ఫెస్టివల్ సంబురం కనబడగా.. కాంగ్రెస్ హయాంలో ఆనాటి వైభవం కనబడడం లే దు. గ్రామ పంచాయతీలకు అరకొరగా విడుదల చేస్తున్న నిధులతో బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడం ఎలా? అని అధికారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఏటా ఇచ్చే చీర కానుకను సైతం ప్రస్తుత ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇస్తామన్న రూ. 500 ఇవ్వకపోవడంతో మహిళలు నిరుత్సాహపడుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) ; పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదు. రా ష్ట్రం ప్రతినెలా అందించాల్సిన ఆర్థిక సం ఘం నిధులూ మూడు నెలలకు ఓసారి అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మేజర్ పంచాయతీలకు స్థానిక వనరుల ద్వారా ఆదాయం వస్తుండడంతో వివిధ ఖర్చులకు ఆ నిధులను సర్దుబాటు చేస్తున్నారు. చిన్న పంచాయతీలకు ఆదాయ వనరులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పు లు చేసి మరీ అవసరాలు తీరుస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అరకొర నిధులతో సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్ల కిస్తీలు, మోటర్ల మరమ్మతు, బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాల మరమ్మతులు వంటి వాటికి వెచ్చిస్తున్నారు. ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు టెంట్హౌస్లు, ఎలక్ట్రిక్ బల్బులతోపాటు చిన్నచిన్న వస్తువులన్నింటికీ సగం చెల్లించి మిగతాది ఉద్దెరకు తెస్తున్నారు. ఇటీవల జిల్లాలో ని 558 పంచాయతీలకు ముష్టిగా ప్రభు త్వం రూ.7.48 కోట్లను విడుదల చేయగా ..అవి ఏమూలకు సరిపోవని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన ఆ కాస్త..నిధులు కూడా పాత అప్పులకే సరిపోయాయంటున్నారు. ప్రస్తుతం జ్వరాలు విజృంభిస్తున్న క్రమంలో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు ఆయిల్బాల్స్ వే సేందుకే డబ్బులు లేకపోగా.. ఇప్పుడు దస రా పండుగకు ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారమవుతున్నదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
కానరాని పండుగ ఏర్పాట్లు ..
కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించారు. ఊరూరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతో వీధిలైట్ల ఏర్పాటుతోపాటు బతుకమ్మ ఆడే స్థలాలు, నిమజ్జనం చేసే ప్రాంతాల చదును, విద్యుత్ దీపాలతో ము స్తాబు చేయడం వంటి పనులను చేపట్టేవా రు. దసరాకు పది రోజుల ముందు నుంచే వాడవాడలు సందడితో కనిపించేవి. అయి తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి పండుగను గతంలో మాదిరిగా నే ఆడంబరంగా నిర్వహిస్తారని ఆనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది. బతుక మ్మ ఆటస్థలాల వద్ద ఏర్పాట్లపైనా ప్రభు త్వం చిన్నచూపు చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం సద్దుల బతుకమ్మకైనా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుందేమో! అనుకుం టే.. అందుకు సంబంధించిన ఏర్పాట్ల కో సం ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాం టి ఆదేశాలు రాలేదని క్షేత్రస్థాయిలో అధికారులు సెలవిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ కళ తప్పిందని ఆడపడుచు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
సర్కారు చిన్నచూపు చూస్తున్నది..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సంబురంగా జరిగేలా అన్ని ఏర్పా ట్లు చేసేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను చిన్నచూపు చూస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా కానుకలను అందించి మహిళలను గుర్తించింది. కానీ కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి కానుకలు అందించలేదు. గ్రామాల్లో బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువుల వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం.
-చెరుకూరి మంగ, పోల్కంపల్లి, ఇబ్రహీంపట్నం రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్చర్ తెలియదు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్చరే తెలియదు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నా బతుకమ్మ పండుగకు అధిక ప్రాధాన్యమిచ్చేది. కేసీఆర్ హయాంలో ప్రతి పల్లె, పట్టణంలో పది రోజుల ముందునుంచే సంబురం కనిపించేది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకు మహిళల పట్ల గౌరవం లేదు కాబట్టే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడంలేదు.
-జే స్వప్న, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
సందడి కనిపించడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు అధిక ప్రా ధాన్యమిచ్చేది. ఈ పండుగకు పది రోజుల ముందు నుంచే గ్రామాల్లో సందడి కనిపించేది. వీధి దీపాల ఏర్పాటు ముందుగానే జరిగేవి. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ కూడా సందడి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పట్టించుకోక పోవ డం సరికాదు.
కేసీఆర్ హయాంలో ఘనంగా ఉత్సవాలు
కేసీఆర్ హయాంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన ఆడబిడ్డలకు పెద్దన్నలాగా ఉండి ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయడంలేదు. బతుకమ్మ చీరలనూ పంపిణీ చేయలేదు.
-కొమ్ము జెల్లమ్మ, గుర్రంగుట్టకాలనీ, ఆమనగల్లు మున్సిపాలిటీ