కడ్తాల్, డిసెంబర్ 5 : పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలకాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ వార్డు సభ్యుడు శ్రీశైలం, సీనియర్ నాయకుడు రామచంద్రయ్యగౌడ్ తదితరులు శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిందని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఓట్లు అడిగేందుకొస్తే హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, బీఆర్ఎస్ రావిచేడ్ గ్రామాధ్యక్షుడు రమేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ లక్ష్మి, మాజీ ఎంపీటీసీలు యాదయ్య, రంగ య్య, నాయకులు బాలకృష్ణ, లింగం, భీరప్ప, భిక్షపతి, పవన్‌కుమార్, హనుమంతునాయక్, రమేశ్, రవికుమార్, వాచ్యానాయక్, హున్యానాయక్, మోబీన్, మహేశ్, సాయికుమార్ పాల్గొన్నారు.