ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌లో ఏండ్లుగా పని చేసిన నాయకులు, కార్యకర్తలను పార్టీ అధికారంలోకి రాగానే పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గురువారం పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన హస్తం పార్టీ నాయకులు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
పెద్దేముల్, అక్టోబర్ 9 : దశాబ్దాలుగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం లభించడం లేదని, అక్కడ విలువ లేదని పెద్దేముల్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు నారాయణ పేర్కొన్నా రు. గురువారం మండలంలోని ఎర్రగడ్డతండాలో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో సురేశ్, ఈశ్వర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరా రు.
ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎస్టీలను బీఆర్ఎస్ ఆదుకున్నదన్నారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. హామీల అమల్లో పూర్తిగా విఫల మైందన్నారు.
రేవంత్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరన్నా రు. ఇటీవల కురిసిన వానలతో నష్టపోయిన రైతులను ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పరామర్శించిన పాపానపోలేదని మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్‌కు ప్రజలు చెప్పడం ఖాయ మన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేశ్, మంచన్‌పల్లి రవి, శ్రీకాంత్‌రెడ్డి, భరత్, జైరామ్, అంజి, అంజిలప్ప, గోవర్ధ్దన్, మల్లప్ప, సంతోష్, కిషన్ పాల్గొన్నారు.
హామీలను తుంగలో తొక్కింది..
పూడూరు : పార్టీ అభివృద్ధికి కృషి చేసే నాయకులకు మంచి గుర్తింపు ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు జంగయ్య, వెంకట్‌రెడ్డి, కె.దాస్ తదితరులు బీఆర్ఎస్ నాయకుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మహేశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మల్లేశం, తిర్మలయ్య, బందెయ్య తదితరులుపాల్గొన్నారు.