నవాబుపేట, సెప్టెంబర్ 5 : కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో పుట్టగతులుండవని, ఆ పార్టీల పతనం మొదలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నా రు. బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేశవపల్లి సర్పంచ్ సుధాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు దయాకర్‌రెడ్డి మా ట్లాడుతూ.. అన్ని గ్రామాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. పార్టీలో చేరిన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో నీరు, రోడ్లు, యూరియా కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాగేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల గౌరవ అధ్యక్షుడు పట్లోళ్ల భరత్‌రెడ్డి, రాజు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, పురుషోత్తంచారి, సీనియర్ నేత ముకుంద్‌రెడ్డి పాల్గొన్నారు.