Tanduru | తాండూరు రూరల్, ఏఫ్రిల్ 8 : తాండూరు మండలం జినుగుర్తిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోసం డిగ్రీతోపాటు కంప్యూటర్ ఆప్లికేషన్ పాసై ఉండాలని, ఆఫీస్ సబార్డినేటర్కు పదోతరగతి పాసై ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తోపాటు బయోడెటాతో మానస హిల్స్, 899జె విఎజి, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్ నెం.7382931496కు సంప్రదించాలని కోరారు.