KPHB Colony | అల్లాపూర్: కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకు నిరంతరం మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్ధన మేరకు అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో ఓ గదిని వివేకానంద నగర్ సంక్షేమ సంఘానికి ఎమ్మెల్యే కేటాయించారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక కార్పొరేటర్ సబీహ బేగం, వివేకానంద నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొల్లు శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరంతో కలిసి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ ఉద్దీన్, నాయకులు రోనంకి జగన్నాథం, తుంగం శ్రీనివాస్, చెవ్వూరు మధుసూదనా చారి, పిల్లి తిరుపతి, వీరారెడ్డి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.