వికారాబాద్, జూన్ 16 : వికారాబాద్ నూతన కలెక్టర్‌గా ప్రతీక్‌జైన్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని చాంబర్లో ఇప్పటివరకు పనిచేసి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి నుంచి ఆయన నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారు లు, నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అభ్యున్నతికి కృషి చేస్తాన న్నారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న తనకు కలెక్టర్‌గా పదో న్నతి కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీవోలు వాసుచంద్ర, శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.