పరిగి : జిల్లా క్యాడర్‌కు అనుగుణంగా వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం నిర్వహించారు. డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, జిల్లా పరిషత్, వైద్య, ఆరోగ్య శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, భూగర్భ జల వనరుల శాఖ, జిల్లా పౌర సంబంధాల శాఖ, ఎంప్లాయి మెంట్, ట్రెజరీ శాఖలకు సంబందించిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్ క్యాడర్లో కేటాయింపులను వారి సీనియారిటి జాబితా ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.