మంచాల, డిసెంబర్ 16 : మూడవ విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకునేందుకు అధికారులకు ఓటర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈనెల 17న జరిగే మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారులతో మంగళవారం దండేటికార్ ఫంక్షణ్హల్లో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమానికి హాజరై వారికి లెక్టర్ తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని 22గ్రామ పంచాయతీలతో పాటు 206వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగనున్నందున అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు ఎప్పడికప్పుడు చూడాలని ఆదేశించారు.
గ్రామాలల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న సమస్యలు తలెత్తినట్లెతే వెంటనే అధికారులు ఆ సమస్యను అక్కడనే పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వద్ద నిఘా నేత్రాల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అనంతరెడ్డి, బాలశంకర్, కేవీవీ ప్రసాద్రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.