వికారాబాద్, మార్చి 2 : జిల్లాలో ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు.
గ్రామపంచాయతీ బిల్డింగ్స్, స్కూల్స్ ప్రహరీ, కిచెన్ షెడ్స్, సీసీ రోడ్లు, తదితర నిర్మాణ పనులను ప్రారంభించి నిలిపివేసిన పనులను సత్వరమే పూర్తి చేసి ఎఫ్‌టీవో జనరేట్ చేయాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి ప్రతి రోజూ టార్గెట్ పెట్టుకోవాలన్నారు. మండలాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.