షాబాద్, నవంబర్ 21 ; రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నా యి. ఉదయం 8 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్త మా, శ్వాసకోశ, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నా రు. జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. దీంతో ఉదయమే బయటికి వెళ్లే పాల వ్యాపారు లు, కూరగాయల రైతులు, కార్మికులు, కూలీ లు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 నుంచి 6గంటల తర్వాత చలి గాలులు వీస్తుండటంతో జ నం ఇండ్లకే పరిమితమవుతున్నారు. వేడి మంటలు వేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు తప్పని సరి..
జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోరుగా వీస్తున్న గాలులు ప్రజలను వణికిస్తున్నా యి. దీనికి తోడు గాలిలో తేమశాతం కూడా పెరుగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటున్నది. తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8గంటల వరకు గ్రామాలతోపా టు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నా యి. చలి గాలుల తీవ్రత పెరుగుతున్నందున ప్రజ లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలిగాలులు ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు స్వెట్టర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే మంచిదంటున్నారు.