CMRF : పేదలకు అండగా ప్రభుత్వ పథకాలు…
కొందుర్గు : పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన రాజనర్సింహారెడ్డి గత కొన్ని రోజుల కిందట ఆనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందాడు. ఆర్థిక స్థోమత సరిపోకపోవడం వలన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మంత్రి సహాయనిధి ద్వార రూ. 28వేలు మంజురు అయ్యాయి. ఈ చెక్కును ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ రాజ నర్సింహారెడ్డికి అందజేశారు.
గ్రామాల్లోని పేద నిరుపేద ప్రజలను అత్యవసర సమయంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రెడ్డి నర్సింలు, గోవర్ధన్‌రెడ్డి, రాజు, రామకృష్ణారెడ్డి, హన్మంతు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

