వికారాబాద్, డిసెంబర్ 13 : యాసంగి 22 -23, వానకాలం 23-24 సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అందించాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలోని మిల్లర్లతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. సీఎంఆర్ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని.. చెల్లించని వారి పై శాఖపరమైన చర్య లు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా వానకాల సీజన్‌కు సంబంధించి వరి ధ్యానం సన్న, దొడ్డు రకం వడ్లను కొనుగోలు కేంద్రా ల నుంచి త్వరగా దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో డీఎస్వో మోహన్‌బాబు, సివిల్ సైప్లె డీఎం విజయలక్ష్మి, మిల్లర్లు పాల్గొన్నారు.
ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డు పరిధిలో పంచాయతీ సెక్రటరీ లు, వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుదారు బీపీఎల్ కార్డు, ప్రస్తుత నివాస గృహానికి సంబంధించిన పూర్తి వివరాలు, కు లం, చిరునామా అన్ని వివరాలతోపాటు ప్ర స్తుతం ఉన్న ఇంటి దగ్గర తీసుకున్న ఫొటో, ఇంటి పరిస్థితిపై లోపల, బయట ఫొటోలు, అలాగే కొత్తగా ఇంటిని నిర్మించతలపెట్టిన స్థ లం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీపీవో జయసుధ, ము న్సిపల్ కమిషనర్లు, వార్డ్డు ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.