బీజేపీతో ఒరిగిందేమీలేదు..
పదేండ్ల మోదీ పాలనలో పాలమూరుకు ఏం లాభం చేకూరిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం సీఎం స్థానిక నివాసంలో పార్లమెంట్ ఎన్నికలను పురస్కరిం చుకొని నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమా వేశాన్ని నిర్వహించారు.
- పదేండ్ల పాలనలో పాలమూరు అభివృద్ధికి నిధులు కేటాయించలేదు
- మోదీ మూడోసారి ప్రధాని అయితే చంద్ర మండలానికి రాజు అవుతారా..?
- గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న అరుణమ్మ ఏం సాధించారు..?
- కొడంగల్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
కొడంగల్, ఏప్రిల్ 8 : పదేండ్ల మోదీ పాలనలో పాలమూరుకు ఏం లాభం చేకూరిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం సీఎం స్థానిక నివాసంలో పార్లమెంట్ ఎన్నికలను పురస్కరిం చుకొని నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రమంత్రిగా ఉన్న డీకే అరుణ పాలమూరుకు ఎన్ని నిధులు తీసుకొ చ్చారని…పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎం దుకు జాతీయ హోదా తేలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ప్రధాని మోదీని మళ్లీ మూడోసారి ప్రధానిగా చేయాలని ప్రజలను కోరుతున్నారని, మూడోసారి పీఎం అయితే చంద్ర మండలానికి రాజు అవుతారా అని ఎద్దేవా చేశారు.
పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాభివృద్ధికి ఎలాంటి నిధులను మంజూరు చేయలేదని.. అలాంటి పార్టీని ఎందుకు గెలిపించాలన్నారు. 75 ఏండ్లుగా కొడంగల్ ప్రాంతం వెనుకంజలో ఉందని.. కాంగ్రెస్ పార్టీ వల్ల కొడంగల్ ఎమ్మెల్యేకు సీఎం పదవి దక్కి రాష్ర్టాన్ని శాసించే అధికారం వచ్చిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నియోజకవర్గాభివృద్ధికి రూ. 5 వేల కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలకు పెద్ద ఎత్తున నిధులు, ప్రతి గ్రామానికీ సీసీ, బీటీ, డబుల్రో డ్ల వంటి ఎన్నో అభివృద్ధి పనులు మంజూరైనట్లు చెప్పారు. కొందరు ఓట్ల కోసం మతాలు, భాషాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొ డంగల్ సత్తాను మరోసారి చూపాలన్నారు. కార్యక్రమం లో తాండూరు ఎమ్మెల్యే మనోహ ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

