ఆమనగల్లు, డిసెంబర్ 26 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్ గేట్ తండాకి చెందిన బాబియా నాయక్‌కి రూ.60వేలు మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గ్యార చంద్రయ్యకు రూ.17వేలు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సోమవారం నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. వేలాది మంది మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫకీరాతండా ఉపసర్పంచ్ నరేందర్‌రాథోడ్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాడ్గుల, డిసెంబర్ 26 : పేదలకు సీఎం సహాయ నిధి వరంలాంటిదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గ్యార చంద్రయ్యకు రూ.17000, హున్యా తండాకు చెందిన బాబియాకు రూ.60000 సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరయ్యాయి. ఆ చెక్కును సోమవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఆయన వెంట రమేశ్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
పేదలకు సీఎం సహాయనిధి వరం
షాద్‌నగర్‌రూరల్, డిసెంబర్ 26: సీఎం సహాయనిధి పేదలకు వరంలా మారిందని ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట సర్పంచ్ సాయిప్రసాద్యాదవ్ అన్నారు. గ్రామానికి చెందిన సుమకి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైనా రూ. 48వేల చెక్కును సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయనిధితో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందుతుందన్నారు.