గప్‌చుప్..
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల్లో అందరికం టే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా.. ప్రచారంలో ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడుగా ప్రచారం ని ర్వహించారు.
- ప్రచారానికి మరింత ఊపునిచ్చిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు
- కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు వచ్చినా బీఆర్ఎస్దే అధికారమని సర్వత్రా చర్చ
- మంగళవారంతో ముగిసిన ఎన్నికల ప్రచారం
- సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఎస్ఎంఎస్లు నిషేధం
- ఈ నెల 30 వరకు ఉమ్మడి జిల్లా అంతటా అమల్లోకి 144 సెక్షన్
- మద్యం దుకాణాలు, బార్లు బంద్
- ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల యంత్రాంగం
- రెండు నెలలపాటు ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం
రంగారెడ్డి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల్లో అందరికం టే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా.. ప్రచారంలో ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడుగా ప్రచారం ని ర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సం క్షేమ పథకాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సబితాఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ లు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మ్యానిఫెస్టోలోని హామీలు ప్రజలకు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది.
ఆత్మీయ సమ్మేళనాలతో మద్దతు
మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలవడంతోపాటు అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. రైతులు, కూలీలు, మ హిళలు, యువకులు, కుల సంఘాలతో సమావేశమయ్యారు. సాగుకు విద్యుత్తు, రైతు బంధు, రై తు బీమా, పింఛన్లు, దళిత బంధు తదితర పథకాలను వివరించి వారి మద్దతును కూడగట్టుకున్నారు.
పట్టణాల్లోని కాలనీలు, బస్తీల్లో స్థానికు లు, వివిధ యూనియన్ల బాధ్యులతో భేటీలు నిర్వహించారు. అపార్ట్మెంట్ల అసోసియేషన్లతో సమావేశమై తాగునీటి వసతి, తగ్గించిన ఇంటి పన్నులు, స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్ రూం ఇండ్లు.. తదితర వాటిపై వివరించారు. ప్ర భుత్వ పథకాల లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలిసి మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు.
వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్రచారం
సోషల్ మీడియా ప్రచారానికి బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దపీట వేశారు. గ్రామ, మండల, నియోకవర్గ స్థాయిల్లో సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బూత్ పరిధిలోని ఓటర్లందరితో కలిసి వాట్సాప్ గ్రూపులను ప్రారంభించా రు. ఇప్పటివరకు అమలు చేసిన అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు ఏమిటి? మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? తదితర వివరాలను గ్రూపులతో పోస్ట్ చేయడంతోపాటు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
సీఎం సభలతో కొత్త పుంతలు
జిల్లాలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, స త్యవతి రాథోడ్, మహమూద్ అలీలు రోడ్ షో లతో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థుల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ నిం పారు. సీఎం కేసీఆర్ మహేశ్వరం, ఇబ్రహీంప ట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, కల్వకుర్తిలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్ర చారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.
సీఎం ప్రచారంతో తమ విజయం ఖాయమవడమే కాకుండా.. మెజార్టీ కూడా భారీ స్థాయిలో పె రుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులకు మద్దతుగా జిల్లాలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. ఏదిఏమైనా మళ్లీ అధికారం మాత్రం బీఆర్ఎస్దేనని జిల్లాల్లో సర్వత్రా చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

