షాద్‌నగర్, మే 14 : సీఎం కేసీఆర్ పాలన తీరు దేశానికే ఆదర్శనీయమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్న విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం మన దేశంలో మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విషయాన్ని దేశంలోని ఏ రైతును అడిగినా చెపుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అనే విషయాన్ని మనమందరం గ్రహించి బీఆర్ఎస్కు మద్ధతు తెలుపాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బూర్గుల గ్రామానికి చెందిన ఎల్లయ్య, బ్యాగరి రవీందర్, రమేశ్, పోలే జంగయ్య, నర్సింహులు, మల్లయ్య, వెంకటయ్య, జగన్, శ్రీను, యాదగిరి, రాజేందర్, అంజయ్య, సాయిలు, శ్రీనివాసులు, లింగారం రవీందర్‌గౌడ్, బాలయ్య బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు రాఘవేందర్‌గౌడ్, వీరేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోరాట యోధుడు సాయన్న
షాద్‌నగర్‌టౌన్ : పేద ప్రజల కోసం పోరాడిన యోధుడు, వారి ఆకలి తీర్చిన మహనీయుడు పండుగ సాయన్న అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాశ్ అన్నారు. షాద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కిన్నెర మొగులయ్య పాటల ద్వారా పండుగ సాయన్న చరిత్ర గురించి అందరికి తెలిసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చక రాష్ట్రంలో ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు.
పండుగ సాయన్న జయంతిని అధికారంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి జిల్లాల్లో ముదిరాజ్ ఆత్మగౌర భవన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అదే విధంగా షాద్‌నగర్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ను ఎకరా భూమిని ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంతకు ముందు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ముదిరాజుల భారీ సంఖ్యలో తరలివచ్చి పటాకులు కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్, సినీ కళాకారుడు రవికుమార్, ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు జ్ఞానేశ్వర్, జగన్, బాబయ్య, రాములు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా భారీ ర్యాలీ
కొత్తూరు : షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా కొత్తూరులో ముదిరాజ్‌లు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాద్‌నగర్‌కు తరలి వెళ్లారు. కార్యక్రమంలో ఎస్బీపల్లి సర్పంచ్ అంబటి ప్రభాకర్, మదిరాజ్ సంఘ పట్టణ అధ్యక్షుడు శివకుమార్, యువజన సంఘం అధ్యక్షుడు దేవేందర్ పాల్గొన్నారు.