షాద్‌నగర్/ఆమనగల్లు, అక్టోబర్ 15 : నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తనున్నది. ఆదివారం సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. జిల్లాలోనూ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు అంతా సిద్ధం చేసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి జైపాల్‌యాదవ్, షాద్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి అంజయ్య యాదవ్‌లకు సీఎం కేసీఆర్ బీ-ఫామ్‌లను అందజేయగా..
నేడు మిగతా నియోజకవర్గ అభ్యర్థులకు అందించనున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఒక విడుత ప్రచారాన్ని పూర్తి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు.