మొయినాబాద్ : మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో కోటీ రుద్రాక్ష నగరిలో కోటీ రుద్రాక్ష అర్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. శుక్రవారం గడప గడపకు రుద్రాక్ష, శివుడి రక్షా సహస్ర స్పటిక లింగార్చన సహిత మహా రుద్రా, మంత్ర పూర్వ కోటీ రుద్రాక్ష అర్చన కార్యక్రమంతో ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణతో అర్చన కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దేవదేవుడికి ఎంతో ప్రీతికరమైన కోటీ రుద్రాక్షలతో అభిషేకం చేశారు. మహాస్పటిక లింగేశ్వరుడికి 100మంది వేదపండితుల ద్వారా మహారుద్రం కార్యక్రమం నిర్వహించారు.