షాబాద్, ఫిబ్రవరి 17 : పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అదే విధంగా శంకర్‌పల్లిలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు విజయలక్ష్మి, నక్షత్రం, గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీలు మాలతీ, శ్రీకాంత్, గోవిందమ్మ, పార్టీ నేత మహేందర్‌రెడ్డి, ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్‌కన్నా, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాపారావు, రంగారెడ్డి, కౌన్సిలర్లు శ్వేత, పాండురంగారెడ్డి, లక్ష్మమ్మ, రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అనాథలకు సేవ చేయడం అభినందనీయం
కేశంపేట : అనాథలు, వృద్ధులకు సేవ చేయడం అభినందనీయమని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో శుక్రవారం కేశంపేట జడ్పీటీసీ, రంగారెడ్డి జిల్లా జడ్పీ మహిళా శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిరుపేదలు, వృద్ధులు, అనాథలకు చేయూతనిస్తున్న జడ్పీటీసీ విశాలశ్రావణ్‌రెడ్డి దంపతులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభినందించారు.
కడ్తాల్‌లో..
కడ్తాల్ : ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల్లోని గ్రామాలు, తండాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని కేక్ కట్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాడ్గుల్ మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
యాదాద్రి ఆలయంలో.. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పూజలు చేశారు.
పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో.. కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పీఆర్టీయూ సంఘం సభ్యులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్, అనిత, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, బాలాజీసింగ్, విజితారెడ్డి, వైస్ ఎంపీపీలు ఆనంద్, అనంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, సర్పంచ్‌లు యాదయ్య, సులోచన, లోకేశ్, భారతమ్మ, తులసీరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెకర్లు లాయక్‌అలీ, వీరయ్య, భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్, చందోజీ, హన్మానాయక్, వెంకటేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు
షాబాద్ : రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి తేరుపల్లి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు స్వామి, వెంకటేశ్ పాల్గొన్నారు.