చేవెళ్ల రూరల్, నవంబర్ 5 : బీఆర్ఎస్తోనే యు వతకు మంచి భవిత అని, యువత అనుకుంటే దేనినైనా సాధించవచ్చని చేవెళ్ల ఎంపీ రం జిత్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్కల రాంరెడ్డి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యే కాలె యాద య్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. దేశం లో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేబీ లేదన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కేవలం 5 గంటల క రెంట్ సరఫరా చేసే కాంగ్రెస్ తెలంగాణలో అబద్ధా లు ప్రచారం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం సారు.. కారు.. సర్కారు మనదే అన్నారు. రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచి తొ మ్మిదిన్నరేండ్లలో అనేక పరిశ్రమలను నెలకొల్పి 24 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల ను కల్పించిందన్నారు.
యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా మంత్రి కేటీఆర్ అనేక పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబ ర్ వన్‌గా తీర్చిదిద్దారని అన్నారు. యువత ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ చేసిన మేలును గ్రామాల్లో ప్రజలకు తెలిపి బీఆర్ఎస్ అభ్యర్థి యాదయ్యను అధిక మెజార్టీతో గెలిపించి.. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే కాలె యాదయ్య మా ట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ బ్రిడ్జిల నిర్మాణానికి అధిక నిధు లు కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఎవరు మంచి పని చేస్తే వారికి ఓటు వేయాలని, నేను పని చేయకపోతే నాకు ఓటు వేయొద్దని, గ్రా మాల్లో యువత చర్చ పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌ను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్ల సంఘం మండ ల అధ్యక్షుడు శివారెడ్డి, మారెట్ కమి టీ మాజీ చైర్మన్ శివనీలచింటు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మం డల యూత్ అధ్యక్షుడు శేఖర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాంరెడ్డి, రైతు బంధు సమి తి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జున రెడ్డి,
బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, స ర్పంచ్‌లు స్వర్ణలతాదర్శన్, లావణ్యాశంకర్, జహంగీర్, వెంకటేశం గుప్తా, భానుతేజ, గుడిమలాపూ ర్ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మా రెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మద్దెల జంగ య్య, వంగ శ్రీధర్ రెడ్డి, శేరి రాజు, సాయినాథ్, రాంరెడ్డి, ఎల్లన్న, నర్సింహులు, మైనార్టీ నాయకుడు ఎంఏ బాసిత్, వివిధ గ్రామాల యూత్ నాయకులు పాలొన్నారు.