Check Posts | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో హైదరాబాద్‌లోకి ఇసుక అక్రమంగా ఎలా వస్తుం ది…? దీనికి సహకరిస్తున్న వారెవరు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది. ఇసుక రీచ్‌ల వద్దే కట్టడి చేస్తే సమస్య ఉండదని ‘గాయం ఒక చోట.. మందు మరోచోట’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగా ణ’లో ప్రచురితమైన కథనంపై పోలీసులు, వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలంటూ పోలీసులకు సూచనలు చేయడంతో నగరంలోకి ఇసుక లారీలు ప్రవేశించకుండా ఉండేలా చర్యలు తీసునేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఎక్కువగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక రీచ్ ల నుంచి ఇసుక హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నది. ఇక్కడ నకిలీ వే బిల్లులు పెట్టుకోవడం, ఒక చోటకు అనుమతి తీసుకొని మరో చోటకు తరలించడం, ఒకే వే బిల్లుతో పదుల సంఖ్యలో లారీలను తరలించడం వంటి జిమ్మిక్కు లు చేస్తూ అక్రమార్కులు నగరానికి ఇసుకను తరలిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇసుకను కొందరు చిరు వ్యాపారులు తెలిసి, మరికొందరు తెలియకుండా డం పింగ్ చేసుకుంటూ దానిని విడి గా చిన్న చిన్న నిర్మాణాలకు విక్రయిస్తున్నారు.
ఇలాంటి వారిపై ఇప్పుడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు చర్య లు తీసుకుంటున్నారు. వందల కిలోమీట ర్ల దూరం నుంచి ఇసుక అక్రమంగా రవా ణా అవుతుందంటే అటూ ఆర్టీఏ, స్థానిక పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ విభాగాల అధికారులు ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కుల వెంట పలుకుబడి ఉన్న వారు ఉండడంతో ఆయా లా రీలు ప్రయాణించే రూట్లలోని యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మమ్మూళ్లు ఇస్తూ నగరంలోకి తీసు కొస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక అక్రమ రవాణా కాకుం డా ఉండేలా నగర శివారుల్లో నిఘాను పటిష్టం చేయనున్నారు.
ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పోలీసు లు, ఇతర అధికార యంత్రాంగం సమన్వయంతో ఈ అక్రమ దందాను నిలువరించేందుకు చర్యలు చేప ట్టాం. అందులో భాగంగానే ఇటీవల అక్రమంగా ఇసుకను తీసుకొచ్చి డంపింగ్ చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తు న్నాం. ఇసుక తక్కువ ధరకు నేరుగా ప్రజలకు అం దేలా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దళారుల చేతు ల్లో పడుతూ బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కట్టడి చేయడంతోపాటు శివారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఇసుక అక్రమంగా హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా ఉండేలా నిఘాను పటిష్ట చేస్తాం.